తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 2025- 26 సంవత్సరానికి కోడూరు మండల పరిధిలోని మూడు మద్యం (03) షాపుల ద్వారా (ఉమ్మడి అన్నమయ్య జిల్లా), 01 పెద్దమండెం మండలం అన్నమయ్య జిల్లా, భారతదేశంలో తయారు కాబడిన మద్యం/ విదేశీ మద్యం అమ్మకానికి లైసెన్స్ మంజూరు కోసం లాట్ల డ్రా ప్రకారం ఎంపిక చేయుటకు దరఖాస్తులు సమర్పించడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో నమోదు చేసుకొనుటకు 21.02.2026 వరకు గడువు అన్నారు 2,00,000/- లక్షల రూపాయల దరఖాస్తు రుసుముతో చెల్లించి తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని తెలిపారు ఆసక్తిగల దరఖాస్తుదారులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర, ఫైర్ స్టేషన్ వెనుక, కోడూరు కార్యాలయంతో పాటు, ప్రకటనలో పొందుపరిచిన జిల్లాలోని ఇతర సంబంధిత కార్యాలయాల నందు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్( షాపు ద్వారా అమ్మకపు లైసెన్స్ మంజూరు లైసెన్స్ షరతులు ) నియమం 2024 లోని నియమం 10 ప్రకారం ద్వారా అన్నమయ్య జిల్లా మదనపల్లె లాట్ల డ్రా స్థలంలోని కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో 23. 02.1026 ఉదయం 8 గంటలకు జరుగుతుందని తెలిపారు. ఇతర వివరముల కొరకు రైల్వే కోడూరు లోని ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని రైల్వే కోడూరు ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ కార్యాలయం కోరింది.