మందలించిన తండ్రి, కనిపించకుండా పోయిన బాలిక, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 04 మనస్సాక్షి :

రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం పరిధిలోని పెద్ద ఓరంపాడు రెవెన్యూ గ్రామ పొలాల వద్ద మామిడి తోటలో తన తండ్రి పెంచలయ్యతో కలిసి నివసిస్తున్న పూజ అనే బాలిక (వయస్సు 10 సంవత్సరాలు), ఈరోజు మధ్యాహ్నం తన తమ్ముడు వెంకటేష్ వయసు 5 సంవత్సరాలు తో ఆడుకుంటూ అల్లరి చేస్తూ గొడవ పడుతూ ఉండగా తన తండ్రి  పెంచలయ్య వారిని మందలించగా అందుకు భయపడిన సదరు బాలిక తాను ఉంటున్న తోటల వద్ద నుండి కనిపించకుండా వెళ్లి పోయినట్లు ఆమె తండ్రి  ఈ రోజు అనగా మార్చి 04 న ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సదరు బాలిక గల్లంతైన విషయమై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడమైనది. ఈ విషయమై రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు, ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ నాయుడు, సిబ్బంది బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు . బాలిక ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌ను నందు సమాచారం ఇవ్వగలరని  ఒక మీడియా ప్రకటనలో పోలీసులు కోరారు.

Facebook
X
LinkedIn
WhatsApp