మంత్రి చేతుల మీదుగా సిఐకి ప్రశంసా పత్రం

రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ పెరేడ్ మైదానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగాయి. జాతీయ పతాకావిష్కరణ అనంతరం, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన అధికారులను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ లు రాయచోటి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చలపతికి ఉత్తమ సేవల గుర్తింపుగా ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాయచోటి అర్బన్ సిఐ చలపతి మాట్లాడుతూ అధికారుల చేత ఈ ప్రశంసాపత్రం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను అని తెలిపారు.వేడుకలలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp