బొజ్జవారిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

* రూ.40 లక్షలతో సిమెంట్ రోడ్ భూమిపూజ
రైల్వే కోడూరు :
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి మెరుగైన రహదారులు కీలకమని, ఈ రోడ్ నిర్మాణంతో ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp