తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 01 మనస్సాక్షి:
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం ఆదివారం నాడు రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మతల్లి బత్యాల భవన్ నందు ఆదివారం నాడు ఉదయం 10:30 నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ తో పాటు స్టీరింగ్ కమిటీ సభ్యులు, పోతురాజు నవీన్ నర్జాల హేమరాజ్ మల్లెం హేమంత్ కుమార్ హాజరయ్యారు . కార్యక్రమంలో పోతురాజు నవీన్ బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత గురించి మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి తాము ఉద్యమాలలో పాల్గొన్నామని కారణం రైల్వే కోడూరు నియోజకవర్గ వాసులకు ఉపాధి అవకాశాలు ముఖ్యంగా టిటిడిలో ఉద్యోగాలలో అవకాశం కలుగుతుందన్నారు.తిరుపతి జిల్లా కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత ఉన్నదని, బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటకు తిరుపతి కి అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయని కావున న్యాయబద్ధమైన రైల్వే డివిజన్ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలని పోతురాజు నవీన్ ఈ సందర్భంగా కోరారు.