కడప/రాయచోటి :
అన్నమయ్య జిల్లా బలిజల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా గండికోట సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా రాజా రంజిత్ రాయల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర బలిజ సంఘం గౌరవాధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, కడప జిల్లా అధ్యక్షులు నాగరాజలు ప్రకటించారు. కడప పట్టణంలోని హరి టవర్స్ నందు నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా బలిజల ఐక్యమత్యంతో ముందుకు వెళ్లేలా కార్యవర్గం కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ భరోసా కల్పించాలని కోరారు. వ్యాపార విద్య తదితర అంశాలలో అభివృద్ధి చెందేలా కార్యవర్గం సహాయ సహకారాలు అందించాలని అన్నారు… సీనియర్ బలిజ నాయకులు రాజేంద్రప్రసాద్ , కోశాధికారి పురం మురళీమోహన్, కార్యవర్గ సభ్యులు అంచల శివప్రసాద్, నలికిరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
బలిజల సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేస్తాం
Post Views: 4
Facebook
X
LinkedIn
WhatsApp