ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత విద్యా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కే.వి.పల్లి మండలం గార్నిమిట్టలోని శ్రీ పార్థ చిల్డ్రన్స్ పాఠశాలలో 25% సీట్లు లాటరీ ద్వారా భర్తీ చేస్తారు. 0–5 కి.మీ పరిధిలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలు అర్హులు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు cse.ap.gov.in లేదా గ్రామ సచివాలయం, ఎంఆర్సీ, పాఠశాలలో దరఖాస్తు చేయాలని అధికారులు తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp