ప్రశాంత వాతావరణంలో బక్రీద్ ప్రార్ధనలు

రాయచోటి :బక్రీద్ పండగ సందర్బంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోని హాజరత్ జమలుల్లా ఈద్గాలో రేపు ఉదయం 7:30 గంటలకు నమాజు, ప్రత్యేక ప్రార్థనలు చేపట్టడం జరుగుతుందని సర్ఖజీ షార్ఫ్ఉద్దిన్ హుసైని తెలిపారు. ఈద్గా ప్రెసిడెంట్ బషీర్ ఖాన్ ఆదేశాల మేరకు ఈద్గా పనులను వర్కింగ్ ప్రెసిడెంట్ బేపారి మహమ్మద్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఈద్గా ఏర్పాట్లను ప్రత్యేకంగా చేపట్టడం జరుగుతుందని, సోదరులందరు గమనించి త్వరగా ఈద్గా రావాలని మహమ్మద్ ఖాన్ కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈద్గా వచ్చే ముస్లిం సోదరుల కోసం గ్లూకోజ్ మరియు మంచి నీటి సౌకర్యం కల్పించమన్నారు. ఈ కార్యక్రమంలో అన్న సలీమ్, బేపారి జాబివుల్లా,బేపారి అసద్ ఖాన్, షావలి, ముజాఫర్ అలీ ఖాన్, ఫైజన్, ఖాళీల్ భేగ్, షఫీ, హాఫిజుల్లా తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp