రాయచోటి : ప్రతి ఒక్కరిలో సేవాభావం కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రవాణా,యువజన,క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి వర్ధంతి సందర్బంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం లక్ష రూపాయలు విలువ చేసే చైర్స్ లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్,వైద్యులు,సిబ్బంది,ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా వారికి ఆసుపత్రి వైద్యులు కమిటీ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి,పట్టు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తమ తండ్రి జ్ఞాపకార్థం మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ వర్ధంతి సందర్బంగా ఆసుపత్రికి చైర్స్ లను వితరణ చేసినట్లు వారు తెలిపారు. రాయచోటి ప్రాంత అభివృద్ధి కోసం, రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అహర్నిషులు కృషి చేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.
