రాయచోటి : ప్రతి పౌరునిలో దేశ భక్తి పెంపొందాలని టిడిపి నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి కొనియాడారు. రాయచోటి పట్టణ శివార్లలోని రాయుడు కాలని,మూడవ వార్డు లోని మండల పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో రాయుడు కాలని టిడిపి నాయకులు రంజిత్ రాయల్, మూడవ వార్డు ఇంచార్జి ఖాదర్ వలి, ఇమ్రాన్, ఉపాధ్యాయలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన త్యాగ మూర్తుల సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 15 వ తేదీన పండుగవతారణంలో దేశ భక్తిని పెంపొందిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా హర్షదాయకం అన్నారు. త్యాగమూర్తుల స్పూర్తి వారి ఆశయాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. టిడిపి నేత శ్రీనివాసులు రెడ్డి, రంజిత్ రాయల్, ఖాదర్ వలీలను ఉపాధ్యాయులు దుశ్శాలవతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, మహబ్బాషలు పాల్గొన్నారు.
