విజయవాడ :
ప్రజలకు ప్రణాళిక బద్ధమైన పాలన అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలువురి నుండి వచ్చిన అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు పనిచేయాలన్నారు.
Post Views: 2