ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్. ముక్కా రూపానంద రెడ్డి

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు, మార్చి 26:

రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని రాఘవరాజుపురం టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల సమస్యలను నేరుగా, త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయగా, ప్రతి సమస్యకు తగిన పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం తన మొదటి ప్రాధాన్యత అన్నారు ముక్కా రూపానంద రెడ్డి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని త్వరితగతిన పరిష్కారం అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp