రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం 12వ వార్డు బేతల్ కాలనీలో మదనమోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ, వారి సోదరుడు మండిపల్లి రాహుల్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆప్యాయంగా పలకరించారు. ప్రజలకు అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్డ్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 1