ప్రజాసేవ లోనే తనకు ఆనందం: ముక్కా రూపానందరెడ్డి.

రైల్వే కోడూరు మార్చి 15 మనస్సాక్షి : రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులువారిపల్లి మండలం ముక్కవారిపల్లి గ్రామంలో ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఆయన సతీమణి ముక్కా వరలక్ష్మి, వారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి నూతనంగా ఏర్పాటైన బస్టాండ్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వం విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర, ఐదు మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం అత్యంత అవసరమని, ప్రజలకు సేవ చేయడంలోనే తనకు ఆనందం కలిగిస్తుందని ఆయన తెలిపారు. ముక్కవారిపల్లి ప్రాంత ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ బస్టాండ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజల కోసం రూపానంద రెడ్డి ఫౌండేషన్ తరఫున చేపడుతున్న సేవా కార్యక్రమాలకు గ్రామప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రూపానంద రెడ్డి సేవలను కొనియాడారు.

Facebook
X
LinkedIn
WhatsApp