ప్రజలు అప్రమత్తంగా వుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి..! సీఐ సి.చంద్రశేఖర్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చ్ 10 మనస్సాక్షి :

రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సి. చంద్రశేఖర్ కోడూరు మండలం పరిధిలోని చియ్యవరం వడ్డేపల్లి గ్రామాన్ని మంగళవారం నాడు సందర్శించారు. ఈ మేరకు అయన గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి చిన్న పిల్లల, మహిళల భద్రత విషయాలపై అవగాహన కల్పించడం జరిగినది. గ్రామ సమస్యలు, గంజా సరఫరా, వినియోగం గురించి విచారించి, అనంతరం సి.సి. కెమెరాల అమర్చుచుకోవడం వలన కలిగే ప్రయోజనాలు వేసవి కాలం అయినందున ఒంటరిగా మిద్దెలపై పడుకోరాదని ఇంటికి తాళాలు వేయకుండా ఎక్కడికి వెళ్ళరాదని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అప్రమత్తంగా వుంటూ అన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి గ్రామ ప్రజలకు వివరించడం జరిగినది. కార్యక్రమంలో ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp