తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు, మార్చి 23 (మనస్సాక్షి):
కోడూరు మండలం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో (ఎన్ఎమ్ఎన్ఎఫ్) ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ద్వారా పండించిన కూరగాయల ప్రదర్శనను మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు.
అనంతరాజుపేట పీహెచ్సీ సెంటర్ సమీపంలో ప్రతి సోమవారం తాజా ఆకు కూరలు, కూరగాయలతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ నిర్వహిస్తున్నారు. ఈ స్టాల్ను ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ బి. ఉషారాణి, ఐసీఆర్ కృష్ణవేణి, కళ్యాణి, గంగమ్మలు కలిసి ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తున్నారని తెలిపారు. అలాగే రైతులు తాము పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను గ్రామస్థాయిలోనే స్టాల్స్ ద్వారా విక్రయించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
Post Views: 3