పోషణ్ పక్వాడా: చిన్నారుల మెదడు వికాసంపై అవగాహన

కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి సెక్టార్‌లోని జి.మదిగపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. రెండు సంవత్సరాల లోపు పిల్లల మెదడు వికాసం 80% జరుగుతుందని తెలియజేస్తూ, తల్లిదండ్రులు పిల్లలతో ఆటపాటలు, ప్రకృతి సందర్శన, సంభాషణలు పెంచాలని సూచించారు. గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారం ఇవ్వాలని, సెల్‌ఫోన్‌లు, ప్యాకెట్ ఫుడ్‌లకు దూరంగా ఉంచాలని వివరించారు. ఆటలు, కథలు, చిత్రలేఖనం ద్వారా ఆలోచనశక్తి, భాషా ప్రావీణ్యం, సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్ పాల్గొనగా, సూపర్వైజర్ జి.భారతి మార్గదర్శనం చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp