తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 04మనస్సాక్షి :
రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని పలు గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి నివాసాల వద్ద అందజేసిన రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి. చిట్వేల్ మండలంలోని కే.ఎస్ అగ్రహారం నకు చెందిన నాసింశెట్టి శ్రీనివాసులు రూ.33, 795,అదే గ్రామానికి చెందిన చేతిపట్టి నరసింహులు రూ.34, 880 సీఎం రాచపల్లి గ్రామానికి చెందిన గంగరాజు హర్షవర్ధన్ రాజు రూ.1,09,849, భూమా శ్రీనివాసులు రూ 15,180, మైలపల్లి గ్రామానికి చెందిన పందికాళ్ళ సాయిరాం రూ.54,995, మహంకాళి సరస్వతమ్మ రూ.34, 284, తిమ్మయ్యగారి పల్లెకు చెందిన ఓరుగంటి లక్షుమ్మ రూ.2,20,000, చిల్లవాండ్ల పల్లెకు చెందిన పంట సంపత్ కుమార్ రూ.43, 253, చిట్వేల్ పట్టణానికి చెందిన కొండూరు కృష్ణంరాజు రూ.1,34,406 పోళ్ళో పల్లి గ్రామానికి చెందిన, కస్తూరి కృష్ణయ్య రూ 43,195, పేరూరు రమణయ్య రూ.25,655, నంది మండలం సుజాత రూ.18,585, మార్గోపల్లి గ్రామానికి చెందిన కొరివి వెంకట శేషమ్మ రూ.37, 895 లకు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని ప్రజలు ఆరోగ్య సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరికి సహాయం అందేలా కృషి చేస్తామని ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసులు రెడ్డి, సీఎం రాచపల్లి సర్పంచ్ సంగరాజు రవికుమార్ రాజు, రాజ కుంట సర్పంచ్ నరసింహ, పందికల మణి ఇతర కూటమి నాయకులు స్థానిక ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు