చిన్నమండెం : పవిత్ర ఉరుసు మహోత్సవం సందర్భంగా జరుగనున్న హాజరత్ గంధపు పీరు, పీర్ల పండుగ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. జూలై 5న రాత్రి 10 గంటలకు గంధపు భారీ ఊరేగింపు చిన్నమండెంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించిన నిర్వాహకులు, మంత్రికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ పండగ మహోత్సవ సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని శాండెల్ సాహెబ్ మాఖన్ కమిటీ వారికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
Post Views: 2