పాలమిత్రాలకు పీలేరులో శ్రీజ డైరీ రిఫ్రెష్మెంట్ కార్యక్రమం

పీలేరు, జనవరి 23, కలం మనస్సాక్షి:
జైకా సంస్థ సహకారంతో శ్రీజ డైరీ ఆధ్వర్యంలో పీలేరు ప్రాంతంలో నూతన పాలమిత్రాల కోసం రిఫ్రెష్మెంట్ మరియు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీజ డైరీ పీలేరు ఏరియా ఆఫీసర్ శివకుమార్, పీఐబీ ఎగ్జిక్యూటివ్ కేశవ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పాలమిత్రాలకు స్వచ్ఛమైన, నాణ్యమైన పాల సేకరణలో పాటించాల్సిన విధానాలు, పాలు కొలిచే యంత్రాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా రాబోయే వేసవి కాలంలో పశువుల ఆరోగ్యం, సంరక్షణకు అవసరమైన సూచనలను తెలియజేస్తూ అవగాహన కల్పించారు. పీఐబీ ఎగ్జిక్యూటివ్ కేశవ మాట్లాడుతూ, ఎన్‌డీడీబీ (ఎన్డిడిబి) సహకారంతో శ్రీజ సంస్థ ద్వారా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్‌లో మెరిట్ సాధించిన పాల ఉత్పాదక కుటుంబాల విద్యార్థులకు రూ.20,000 విలువైన స్కాలర్‌షిప్ అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశం పాల ఉత్పాదక కుటుంబాలకు ఎంతో ప్రోత్సాహకరమని అన్నారు.
కార్యక్రమం ముగింపులో ఏరియా ఆఫీసర్ శివకుమార్ పాలమిత్రాలకు ఎగ్జిక్యూటివ్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు మరియు 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీలను పంపిణీ చేశారు. గ్యారంపల్లి, కలకడ, గర్నిమిట్ట, గడి, పీలేరు ప్రాంతాలకు చెందిన నూతన పాలమిత్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్‌వైజర్లు నాగార్జున, మోహన్, రియాజ్, ప్రదీప్, మల్లికార్జున రెడ్డి సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

Facebook
X
LinkedIn
WhatsApp