పార్టీ కేంద్ర సమీక్ష సమావేశంలో చమర్తి జగన్

గుంటూరు : ఆదివారం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశానికి రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. జూలై రెండవ తేదీన నుండి ప్రతి ఇంటికి ప్రజలకు దగ్గరయ్యే విధంగా కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం అమలు చేస్తున్న మెగా డీఎస్సీ, పింఛన్లు, ఇండ్లు, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ మరియు ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించడం ఇంకా మరెన్నో పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచనల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టిడిపి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులకు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఇన్చార్జిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp