నేను మీకు దొరకను… నేను అడా వుంటా.. ఏడైనా వుంటా ! ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్న ఎలుగుబంట్లు

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లిలో ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది కృ ష్ణపట్నం వెళ్లే రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వస్తున్న దేసయ్య( 56) పై ముళ్ళ పొదలలో  దాగి వున్న ఎలుగుబంటి ఒక్కసారిగా వచ్చి దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి, బాధితుడిని హుటాహుటిన రైల్వే కోడూరులో ప్రభుత్వ పసుపత్రికి చర్చి మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యులు.

గత 12 రోజులలో ఎలుగుబంటి దాడులకు ముగ్గురు గాయపడ్డారు వీరిలో అమర్నాథ్రెడ్డి అను వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు అధికారులు స్పందించి బోన్లు ఏర్పాటు చేసి వాటిని పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp