రాయచోటి ; నిస్వార్థ సేవకు ప్రతిరూపం జిన్నా సేవా సంస్థ. అలాగే అనాధలకు అభాగ్యులకు సహాయ సహకారాలు అందించడంలో జిన్నా సేవా సంస్థ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. సహాయం కావాలి అని కోరిన వెంటనే సమస్యను పరిశీలించి వారికి కావలసిన సహాయ సహకారాలను జిన్నా సేవా సంస్థ అందిస్తూ ఉంటుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి చెందిన పేద కుటుంబంలో ఇంటి యజమాని కూలి పని చేసుకుంటు జీవనం కొనసాగించే తరుణంలో కుమార్తె వివాహం నిశ్చయించడంతో ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కుటుంబ సభ్యులు జిన్నా సేవా సంస్థకు తెలుపగా సంస్థ అధ్యక్షులు జిన్నా షరీఫ్ ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. జిన్నా సేవా సంస్థ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post Views: 5