రాయచోటి : రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వందలాది మంది ప్రజలు హాజరై తమ సమస్యలు మంత్రి గారికి వివరించారు. ఉదయం నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక్కొక్కరి సమస్యను ఓపికగా విన్న మంత్రి, సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశించారు. ప్రతి ఒక్క సమస్యను పరిశీలిస్తూ, వాటికి తక్షణ పరిష్కారాలు సూచించిన మంత్రి గారి చొరవ ప్రజల్లో విశ్వాసం నింపింది. ప్రజల మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి సేవా దృక్పథం ప్రజల్లో హర్షాతిరేకాన్ని కలిగించింది.
Post Views: 2