నియమాలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవు

మదనపల్లి ట్రాఫిక్ ఎస్.ఐ శివకామిని స్పష్టం
మదనపల్లె : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని,లేనియెడల జరిమానాలు తప్పవని మదనపల్లి ట్రాఫిక్ ఎస్.ఐ శివకామిని పేర్కొన్నారు.మంగళవారం పట్టణంలోని టౌన్ బ్యాంక్ సర్కిల్ నందు ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నియమ,నిబంధనలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు రికార్డులు కలిగి ఉండాలని,అదేవిధంగా ప్రతి ఒక్కరు లైసెన్స్ పొందాలన్నారు.ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాలని తద్వారా ప్రమాదాల నుండి బయటపడాలన్నారు.అదేవిధంగా పట్టణంలో ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలుపురాదని,పార్కింగ్ కొరకు కేటాయించిన స్థలంలోని వాహనాలను నిలపాలన్నారు.ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలపై పలుమార్లు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి జరిమానాలు విధిస్తామని ఆమె హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp