రాజంపేట :
కడప జిల్లా రాజంపేట మండలం మందరం రాచపల్లె గ్రామంలో నిర్వహించిన నామకరణ మహోత్సవానికి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఆలయ చైర్మన్ శంకర్రాజు మనవరాలు చిన్నారి లియారా కృత్తికకు రాజు ఆశీర్వాదాలు అందించారు.
ఈ సందర్భంగా చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేసి, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 1