రాయచోటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాష దూదేకుల ఆర్థిక సంస్థను నెలకొల్పినందుకు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాసాపేటలో అన్నమయ్య దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడిపల్లి ఫకీర్ సాబ్, జాతీయ ఉపాధ్యక్షులు సుంకేసుల ఖాదర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి క్యాబినెట్ మంత్రులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, కొండూరు మహమ్మద్ షఫీ, ట్రెజరర్ అడవి కాళ్ళ సత్తార్, జిల్లా కార్యదర్శి ముజాహిర్ రెహమాన్, వెండి కట్ల ఇనాయతుల్లా, సి.పీరు సాహెబ్, తెలుగుదేశం పార్టీ నాయకులు తరుగు నాగరాజ, సభ్యులు వన్నూరు, సుభహాన్, మస్తాన్, మాజీ కౌన్సిలర్ ఎం.భాష, అడవి కళ్ళ సర్దార్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
దూదేకుల ఆధ్వర్యంలో చంద్రబాబుకు పాలాభిషేకం


Post Views: 6
Facebook
X
LinkedIn
WhatsApp

