దాతృత్వ ధార్మిక చింతనల కలయికే రంజాన్

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం అనపగుట్ట బిస్మిల్లా మసీదులో పవిత్ర శుక్రవారం సందర్భంగా వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల సమ్మేళనమని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌లో శుక్రవారం ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన రోజని తెలిపారు. స్థానిక ముస్లింల ఆహ్వానంపై ప్రార్థనలకు హాజరైన నిస్సార్ అహమ్మద్‌కు ప్రజలు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఇబ్రహీం, అలీబాషా, మహమ్మద్ గౌస్, హషీం, ఇస్మాయిల్, యూనస్, షానవాజ్, అబిద్, ఫక్రుద్దీన్, జైనుద్దీన్, సత్తార్, నాసిర్, హబీబ్, ఖాదర్ బాషా, సోహైల్, జబివుల్లా, ఖిజార్ ఖాన్, అబ్దుల్లా, సమద్, ఫయాజ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp