తలుపుల పి.హెచ్.సి వైద్యాధికారిగా గిరీష

పీలేరు : అన్నమయ్య జిల్లా పీలేరు మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తలుపులలో గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించిన డాక్టర్ యం రమేష్ రెడ్డి కె.వి పల్లి మండలంలోని గ్యారంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీపై వెళ్లారు. సదుం మండలంలో చేరుకువారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డా యల్. గిరీష తలుపుల పిహెచ్ సి కి బదిలీపై వచ్చారు. ఇటీవల నిర్వహించిన సాధారణ బదిలీలలో ఆమె తలుపులకు వచ్చారు. ఈ సందర్బంగా డా గిరీష ని తలుపుల వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp