తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

రాయచోటి : రాయచోటి ఘటన గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. జాతీయ భద్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ఇతర ప్రసారమాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా, అవాస్తవాలను సృష్టించినా, పుకార్లు ప్రసారం చేసినా, షేర్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రూప్ అడ్మిన్ లు తనిఖీ చేసుకోవాలని, తప్పుడు సమాచారం వస్తే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని, ప్రజలు భయభ్రాంతులు కలిగించే ఊహాగానాలు, కథనాలు, దృశ్యాలు సృష్టించినా, పుకార్లు వ్యాప్తి చేసినా, ప్రసారం చేసినా షేర్ చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో మీడియా పాత్ర విలువైనదని పోలీసు శాఖకు సహకరించాలన్నారు. సోషల్ మీడియాపై నిఘా ఉంచామని సమాచారాన్ని చేరవేసేముందు పోలీసు అధికారులతో నిర్ధారణ చేసుకోవాలని, జాతీయ భద్రతకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Facebook
X
LinkedIn
WhatsApp