డాల్ఫిన్ డేల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో విద్యార్థినీ విద్యార్థులకు “ఫేర్ వెల్ ” కార్యక్రమం

రైల్వే కోడూరు ఫిబ్రవరి 26 మనస్సాక్షి:

 తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని డాల్ఫిన్ డేల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఫేర్ వెల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పంజం శ్రీవర్ధన్ రెడ్డి, నవీన అధ్యక్షతన కోలాహలంగా ప్రారంభమైనది.కార్యక్రమంలో మొదటగా పాఠశాల నిర్వహించిన ఐఐటీ పరీక్షలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. అనంతరం ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను అందుకుని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావడమే గాక ఉన్నత లక్ష్యాలు అందుకోవాలని ఉపదేశించారు. తదనంతరం విద్యార్థులు మాట్లాడుతూ విలువలతో కూడిన ఉన్నత విద్యను తమకు అందించిన యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు పలు నృత్యాలతో ఉల్లాసంగా ఉత్సాహభరితంగా  అలరించారు, ఫేర్ వెల్ కార్యక్రమం అధ్యంతం విద్యార్థుల ఆటపాటలతో ప్రసంగాలతో ఉల్లాసభరితంగా కొనసాగింది కార్యక్రమంలో హెడమాస్టర్ టి బాలకుమార్, ఉపాధ్యాయ బృందం టి.చంగయ్య, రఘు, టి శేఖర్, పి మధుబాబు, నిర్మల సరోజ, మహీరా, పిఈటీ మహేష్ తదితర సిబ్బంది కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసిన వారిలో ఉన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp