రైల్వే కోడూరు, ఫిబ్రవరి 26 (మనస్సాక్షి):
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని డాల్ఫిన్ డెల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఫేర్‌వెల్ కార్యక్రమం ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమానికి విద్యార్థినీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పంజం శ్రీవర్ధన్ రెడ్డి, నవీన ఆధ్వర్యంలో కోలాహలంగా ప్రారంభమైనది.మొదటగా ఐఐటీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు తమ అమూల్యమైన ప్రసంగాలతో విద్యార్థులకు మార్గ నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ప్రసంగిస్తూ తమకు ఉన్నత విద్యను అందించిన పాఠశాల యాజమాన్యానికి గురువులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల పాటలతో నృత్య ప్రదర్శన చేసి అలరింప జేశారు.చివరగా స్కూల్ ఫైనల్ విద్యార్థులతో యాజమాన్యం,ఉపాధ్యాయు బృందం కలిసి స్మారక ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పంజం శ్రీవర్ధన్ రెడ్డి, నవీన, హెడ్మాస్టర్ టి.బాలకుమార్, ఉపాధ్యాయులు టి.చంగయ్య, రఘు, టి.శేఖర్, పి.మధుబాబు, నిర్మల, సరోజ, పీఈటీ మహేష్ మిగిలిన సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post Views: 4