గాలివీడు : మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆదివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం, గుండ్ల చెరువుకు చెందిన క్యాన్సర్ బాధితురాలు అనిమల రమాదేవికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అనిమల రమాదేవి మంచి మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందాలన్నారు. అనిమల్ రమాదేవికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రివర్యులు వైద్యులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 2