టెలికం సలహా సభ్యునిగా షేక్ అబూజర్

రాయచోటి : చిత్తూరు జిల్లా కమిటీ బీఎస్ఎన్ఎల్ టెలికాం సలహా సభ్యుడి(టీఎసీ)గా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి చెందిన షేక్ అబూజర్ నియమితులయ్యారు. బీఎస్ఎన్ ఎల్ తిరుపతి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆయనకు నియామకపత్రం పంపారు. షేక్ అబూజర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సిఫారసు చేయడంతో ఆయనను నియమించారు. ఈ సందర్భంగా షేక్ అబూజర్ మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి సహకరించిన ఎంపీ మిధున్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. టెలికమ్యూనికే షన్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపినాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp