ఒంటిమిట్ట : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కడప జిల్లా,ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పర్యవేక్షణ బాధ్యతలలో భాగంగా ఒంటిమిట్టలో నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులతో మాట్లాడి, వారి నామినేషన్ విత్ డ్రా చేసుకొని టిడిపి అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరారు. జడ్పిటిసి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, పుంగనూరు ఇన్చార్జి చల్లా బాబు, ఒంటిమిట్ట మండల నాయకుడు నరసయ్య సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 0