జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం

అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి 27: జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘జీరో టోలరెన్స్’ విధానంతో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన నార్కోటిక్స్ సమన్వయ సమావేశంలో డ్రగ్స్ రవాణా, వినియోగంపై డ్రోన్లతో నిఘా, రద్దీ ప్రాంతాల్లో స్నిఫర్ డాగ్స్ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. పాఠశాలల సమీపంలో ‘కూల్ లిప్’ వంటి నికోటిన్ పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మదనపల్లిలో త్వరలోనే డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యసన బాధితులకు పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ 1972కు అందించాలని, సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని ఎస్పీ సూచించారు.

Facebook
X
LinkedIn
WhatsApp