అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం శిబ్యాల గ్రామంలో వెలసి ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు, టీడీపీ యువ నాయకుడు మిన్నం మౌర్య రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి ఆశీర్వాదాలు పొందారు. రాష్ట్రంలో దేవస్థానాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
Post Views: 2