చెర్లోపల్లె అభివృద్ధికి కృషి చేస్తా చమర్తి జగన్

రాజంపేట : అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని హెచ్.చెర్లోపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని రాజంపేట పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. శుక్రవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా హెచ్.చెర్లోపల్లి గ్రామంలో ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమాన్ని ఆయన కొనసాగించారు. గ్రామానికి అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చిత్తశుద్ధితో పని చేస్తామని, అతి త్వరలోనే సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. కోపి చెరువు నుండి హస్తవరం చెరువుకు నీటిని మళ్లించాలని రైతులకు ఎటువంటి నీటి సమస్య లేకుండా చూడాలని అంతేకాకుండా సిమెంట్ రోడ్లు, త్రాగునీరు గ్రామ సచివాలయము లాంటి అభివృద్ధి పనులను చేపట్టాలని గ్రామస్తులు కోరారు. 2047 విజన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ పటంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp