చిన్నారికి కె ఎస్ షానవాజ్ ఆర్థిక సాయం

కదిరి, ఏప్రిల్ 05 : కదిరి పట్టణానికి చెందిన అహమద్ భాషా కుమార్తె 15 నెలల ఫాతిమా అనే చిన్నారి క్యాన్సర్ తో బాధపడుతూ బెంగుళూరు లో చికిత్స పొందుతూ ఉన్నది తన వంతుగా కదిరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కె ఎస్ షానవాజ్ గతం లో 25,000 రూ. ఆర్థిక సాయం అందించడం జరిగినది. ఈ రోజు మరొక్కసారి 80,000/-వేల రూపాయలు ఆపరేషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఫాతిమా ఆరోగ్యం తొందరగా బాగుపడాలని అల్లాని అందరం ప్రార్థిద్దాం. అలాగే నియోజకవర్గం లో పేదలుకు ఎల్లవేళలా తోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp