రాయచోటి : బుధవారం రోజు సాయంత్రం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్య రెడ్డి గారి సమక్షంలో కొత్తపేటలో ఉండే యూత్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సోదరుడు మాట్లాడుతూ ముందు ముందు నియోజకవర్గంలో భారీగా పార్టీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జా ఆది రెడ్డి, రవి బాబు దేవేంద్రారెడ్డి, చల్మారెడ్డి వాసుదేవరెడ్డి, శంకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 3