కొత్త పెన్షన్ల మాటెత్తని కూటమి ప్రభుత్వం

రాయచోటి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 మాసాలవుతున్నా కొత్త పెన్షన్ల మాటెద్దడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి నేతలు ప్రజా స్వామ్యాన్ని పూర్తిగా విస్మరించి,ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎండమావిగా మార్చి,సూపర్ సిక్స్ ను ఆటకెక్కించారన్నారు.ఇంటికి జీవనాధారమైన భర్త మరణిస్తే భార్యకు బతుకు భారం కాకుండా వితంతు పెన్షన్ తో ఆదుకోవాల్సిన ప్రభుత్వం భర్త పింఛన్ పొందుతూ మరణిస్తేనే భార్యకు వితంతు పింఛన్ వర్తింప చేస్తామని స్పౌజ్ పెన్షన్ల పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుపేద, అర్హత కలిగిన వితంతువులకు అశనిపాతంలా తయారైందన్నారు. జగన్ హయాంలో అర్హతే ఆధారంగా , శాచురేషన్ మోడ్ లో సంతృప్తికరంగా పెన్షన్లను మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఎస్ సి,ఎస్ టి, బిసి,మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీ ఊసెత్తక పోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అర్హులందరికీ వెంటనే నూతన వృద్దాప్య, వికలాంగ, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి , చర్మకారులు, డప్పు కళాకారులు తదితర పెన్షన్లను మంజూరు చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp