కె.వి పల్లి లో జనగణన శిక్షణ ప్రారంభం

జనగణన–2027లో భాగంగా స్వీయ గణన కార్యక్రమానికి సంబంధించిన శిక్షణ తరగతులు కె.వి.పల్లి మోడల్ స్కూల్లో ప్రారంభమయ్యాయి. మండల తహసీల్దార్ బి.నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు గృహ వివరాల సేకరణ, డేటా నమోదు విధానాలపై మార్గదర్శనం ఇచ్చారు. ఫీల్డ్ సమస్యలు, ప్రజలతో వ్యవహారం, గణాంకాల ఖచ్చితత్వంపై అవగాహన కల్పించారు. శిక్షణ 23వ తేదీ వరకు మూడు బ్యాచులుగా కొనసాగనుంది అని మండల తాసిల్దార్ తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp