కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి

రాయచోటి : కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లాలని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని రాయచోటి లో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజల్లో దూసుకెళ్లాలన్నారు. గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బిజెపి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. సుండుపల్లెలో 20 కుటుంబాలు వైసీపీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. చీఫ్ సెక్రటరీ అమీర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సింగం రామకృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిగర్ సుల్తానా, లీగల్ సెల్ అధ్యక్షులు తొట్లి వెంకటరమణారెడ్డి, రాయచోటి పట్టణ అధ్యక్షుడు బాబా సర్దార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి మన్సూర్ ఆలీ ఖాన్, టౌన్ మహిళా అధ్యక్షురాలు స్వనజా రెడ్డి నూతన కార్యవర్గం పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp