కడప, కలం మనస్సాక్షి :
ఆంధ్రప్రదేశ్ లోనే ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన కడప పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గాను గంధం, ఉరుసు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు శనివారం దర్శించుకున్నారు. తొలుత పిఠాధిపతి హజరత్ ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా మహ్మద్ మహ్మదుల్ హుస్సేనిను ప్రసాద్ బాబు మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు పొంది పీఠాధిపతికి శాలువ కప్పి సన్మానం చేశారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ కడప పెద్ద దర్గా మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తోందని, కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు దర్శించుకోవడం జరిగిందన్నారు. భగవంతుని ఆశీస్సులు భక్తులపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలు పాడిపంటలు, సుఖశాంతులతో వర్ధిల్లే విధంగా ప్రార్థించానన్నారు. వీరి వెంట రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు.