పీలేరు నియోజకవర్గంలో ఎస్సీ/ఎస్టీ గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యే నల్లారి కిషన్ కుమార్ రెడ్డి స్పందించాలని అన్నమయ్య జిల్లా మాలమహానాడు నేతలు కోరారు. జెట్టి మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తుమ్మల ధరణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, స్మశానవాటికలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దురాక్రమణకు గురైన ఎస్సీ/ఎస్టీ భూములపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, ప్రతి మండలంలో అంబేడ్కర్ భవనం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో మచ్చా రెడ్డయ్య పాల్గొన్నారు.
Post Views: 3