ఎలుగుబంటి దాడిలో గాయపడిన రైతుకు రూ.2.90 లక్షల ఆర్థిక సహాయం.

తిరుపతి జిల్లా మార్చి 12 మనస్సాక్షి :

రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులువారిపల్లి మండలం బాలిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నాగేళ్ల అమరనాధ్ రెడ్డి ఇటీవల తన పొలంలో పని చేస్తున్న సమయంలో ఎలుగుబంటి దాడికి గురై తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనపై స్పందించిన రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ తరఫున ఇప్పటికే రూ.50 వేల ఆర్థిక సహాయం అందించగా, ప్రభుత్వం తరఫున విడుదలైన రూ.2 లక్షల 90 వేల రూపాయల చెక్కును ఫారెస్ట్ అధికారులతో కలిసి బాధితునికి అందజేశారు.ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించినట్లు ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందేలా తాము అండగా ఉంటామని ముక్కా రూపానంద రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులతో పాటు తాతంశెట్టి నాగేంద్ర, యర్రగుండ్ల జయప్రకాష్ ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp