ఎం.హెచ్.పి.ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా హజీరా

రాయచోటి : మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలిగా షేక్ హజీరాను రాష్ట్ర అధ్యక్షులు ఫారుక్ షుబ్లి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి సగీర్, జిల్లా అధ్యక్షులు ఖాదరభాషల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డులోని ఎస్ఎన్ కాలనీ ఎం.హెచ్.పి.ఎస్ కార్యాలయంలో ఈ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సగీర్ మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యత కల్పించడంలో ఎం.హెచ్.పి.ఎస్ ఇప్పుడు ముందుంటుంది అన్నారు. అనంతరం జిల్లా మహిళా అధ్యక్షురాలు హజీరా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు ఫారుక్ షుబ్లి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మహిళలకు ఏ సమస్య వచ్చిన ముందుండి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు షేక్ దిల్షాద్, రాయచోటి పట్టణ అధ్యక్షురాలు ఎస్ నాగజ్యోతి, స్టేట్ స్టూడెంట్ కన్వీనర్ ఇమ్రాన్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp