కె.వి పల్లి :
యుటిఎఫ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించుదాం ఊరి బడులని కాపాడుదాం, బడి మనదే బాధ్యత మనదే అనే నినాదంతోచేపట్టిన కార్యక్రమాన్ని తల్లి తండ్రులు వద్దకు తీసుకుపోవాలని కె.వి.పల్లి మండల విద్యాశాఖ అధికారులు రెడ్డి బాష, సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఈ విషయాన్ని తల్లి తండ్రులు గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అలాగే బడి ఈడు పిల్లల అందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం యుటిఎఫ్ సంఘం చేపట్టడం అభినందనియం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల గౌరవాధ్యక్షుడు రమణారెడ్డి, అధ్యక్షుడు వెంకటరమణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉదయకిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య ఉపాధ్యాయులు ప్రభాకర్, నవీన్, వెంకటరమణ, మోవాన్, ప్రభాకర్, ఆంజనేయులు తదితరులు ఫాల్గోన్నారు.