రాయచోటి: రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆదివారం రాయచోటి పట్టణంలోని బండ్లపెంటలో ఉన్న దివానే సాహెబ్ దర్గా నందు జరుగుతున్న ఉరుసు ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో జరుగుతున్న దివానే సాహెబ్ ఉరుసు ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావడం జరుగుతుందని ప్రతి సంవత్సరం భక్తులు సంఖ్య పెరుగుతూ ఉరుసు ఉత్సవాల అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో ఈ ఉరుసు ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రివర్యులు తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులకు మంత్రి సూచించారు.
Post Views: 16