రాయచోటి :
2025-26 ఇంటర్ ప్రథమ,ద్వితీయ ఫలితాల్లో రాయచోటి ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ అరమాటి శివగంగి రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బైపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాయి రూత్విక 1000 మార్కులకు 990 మార్కులు, అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి హసన్ 455కు 447 మార్కులు, షబీహ 455కు 446 మార్కులు సాధించారని, మొదటి సంవత్సరం ఎంపీసీ సి.హిమబిందు 470 కి 465 మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ అరమాటి శివగంగ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల తరఫున రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కృషి చేసిన అధ్యాపక బృందంతో పాటు ఇతర సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా మంచి మంచి మార్కులు సాధిస్తూ ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.